సింప్లిసిటీ అంటే మన్మోహన్ దే.. ప్రధానిగా ఉన్నా మారుతీ 800 అంటేనే ఇష్టమంట

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26న కన్నుమూసిన  సంగతి తెలిసిందే.. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఆయన విధివిధానాలు దేశంలో పలు  కీలక మార్పులు తీసుకొచ్చాయి. అయితే  దేశానికి ప్రధానిగా పనిచేసినా  మన్మోహన్ సింగ్   గొప్పతనం కంటే సింప్లిసిటీకే ప్రాధాన్యత ఇచ్చేవారంట. లక్సరీ కారు  బీఎండబ్ల్యూకి  బదులుగా ఆయన మారుతీ సుజుకి 800 కే  ప్రాధాన్యాత ఇచ్చేవారంట..అది ఆయన నిరాడంబర జీవితానికి ఉదాహరణ. యూపీకి చెందిన మంత్రి అసిమ్ అరుణ్ సింగ్..మన్మోహన్ సింగ్ గురించి తన ఎక్స్ లో  ఈ ఆసక్తికర విషయాలు చెప్పారు.

అత్యాధునిక  హంగులతో కూడిన బీఎండబ్ల్యూ సహా ..హై సెక్యూరిటీ  లగ్జరీ కార్లు ఉన్నా మన్మోహన్ సింగ్   ఎప్పుడూ మారుతీ సుజుకి 800 వాడేవారు. బీఎండబ్ల్యూ కారులో ప్రయాణించడం ఇష్టం లేదని.. తనకు  మారుతి కారంటేనే ఇష్టం అని అరుణ్ సింగ్ కు మన్మోహన్ చెప్పేవారంట. మన్మోహన్ సింగ్ మరణ వార్త విన్న  వెంటనే అరుణ్ సింగ్  తన ఎక్స్ లో తెలిపారు. 

ALSO READ : మీకు తెలుసా: ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారు కదా.. వీటిని తీసుకొచ్చింది ఈ మన్మోహన్ సింగ్నే..

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో నేను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) మాజీ చీఫ్ గా మూడు సంవత్సరాలు పనిచేశాను .   క్లోజ్ ప్రొటెక్షన్‌కు అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా టీమ్ లో  ఒక్క అంగరక్షకుడిగా అంటే.. ఎప్పుడు నీడలా  అతని వెంట ఉండటమే నా బాధ్యత. ఎక్కడికెళ్లినా  బీఎండబ్ల్యూ కారు  కంటే నాకు ఈ మారుతి కారే ఇష్టం అని మన్మోహన్  చెప్పేవారని మాజీ ఐపీఎస్ అధికారి అరుణ్ సింగ్ తెలిపారు.

వృద్ధాప్య కారణాలతో  మన్మోహన్ సింగ్ (92) డిసెంబర్ 26న  రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  మరణించిన సంగతి తెలిసిందే.డిసెంబర్ 28న ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.