మణిపూర్‌లో మరోసారి బీజేపీ అధికారం నిలబెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయం పార్టీ విజయ బావుటా ఎగురవేసింది. దీంతో బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ సందర్భంగా ఇంఫాల్‌లోని పార్టీ కార్యాలయంలో మణిపూర్ ముఖ్యమంత్రి విజయోత్సవాల్లో పాల్గొన్నారు. సీఎం ఎన్ బీరేన్ సింగ్ ఇతర పార్టీ నాయకులతో కలిసి డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడంతో వారంతా ఆనందలో మునిగి తేలుతున్నారు.
ఈ సందర్భంగా సీఎం బీరెన్ సింగ్ మాట్లాడుతూ... చారిత్రాత్మక విజయం అందించిన మణిపూర్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డైనమిక్ నాయకత్వం పౌర కేంద్రీకృత పాలనపై ప్రజల విశ్వాసానికి ఈ గెలుపు నిదర్శనమన్నారు. బీజేపీ కార్యకర్తలందరికీ తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మణిపూర్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత ఎన్ బీరెన్ సింగ్ హీంగాంగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రత్యర్థి పంగీజం శరత్‌చంద్ర సింగ్‌పై 17,000 ఓట్ల తేడాతో గెలుపొందారు.
#WATCH | Manipur CM N Biren Singh dances with other party leaders at the party office in Imphal, as they celebrate BJP's victory in #ManipurElections2022 pic.twitter.com/D1ogcOg4Ia
— ANI (@ANI) March 10, 2022
ఇవి కూడా చదవండి:
