ఈదురుగాలులతో నేలరాలిన మామిడికాయలు

మరికల్, వెలుగు : ఈదురుగాలులు, అకాల వర్షంతో గురువారం రాత్రి నారాయణపేట జిల్లా మరికల్​ మండలం తీలేరు గ్రామంలోని ప్రశాంత్​కుమార్​రెడ్డి మామిడితోటలో కాయలు నేలరాలాయి. 5 కరెంటు పోల్స్, ట్రాన్స్​ఫార్మర్​ పడిపోయాయి. రూ.8 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. అలాగే పలు గ్రామాల్లో వరి పంట నేలకొరిగింది.

హైవే వెంబడి ఉన్న భారీ వృక్షాలు నేలకొరగడంతో రాకపోకలు స్థంభించాయి. వాటని పోలీసులు వెంటనే తొలగించి రాకపోకలను పునరుద్దరించారు. పూసల్​పహాడ్​ గ్రామంలో బసిరెడ్డికి సంబంధించిన బొప్పాయి తోటలో పండ్లు రాలిపోయి నష్టం వాటిల్లింది. నష్టపోయిన వారిని గుర్తించి ఆదుకోవాలని రైతులు కోరారు.