ఐదెకరాల భూమి ఉందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

ఐదెకరాల భూమి ఉందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన వ్యాఖ్యలపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ తిప్పికొట్టారు. టీడీపీ నేతలు అమరవాతిలో రాజధాని పేరుతో ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు కొన్ని వీడియోలను విడుదల చేశారు. ఆ వీడియోలపై టీడీపీ నేత బోండా ఉమ మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జరిగిన కేటాయింపులపై ఇప్పుడు తమని ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమన్నారు.

టీడీపీ నేతలు ధూళిపాళ్ల నరేందుకు, బాలకృష్ణ అల్లుడు భరత్, పయ్యావుల కేశవ్, పత్తిపాటి పుల్లారావులు అమరావతి లో భూములు కొన్నారంటూ వైసీపీ నేతలు అవాకులు చెవాకులు పేల్చుతున్నారని అన్నారు. టీడీపీ నేతలు భూములు కొనుగులో చేయడం అక్రమమైతే..వైసీపీ నేతలు భూములు కొనుగోలు చేయడం సక్రమం అవుతుందా అని ప్రశ్నించారు..? వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి భార్య పేరిట ఉన్న ఐదెకరాల భూములు గురించి స్పందించాలని బోండా ఉమ

డిమాండ్ చేశారు.

ఆ వ్యాఖ్యలపై ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాజధాని అమరావతి ప్రాంతం నీరు కొండూరులో తనకి 5 ఎకరాల భూమి ఉన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. తన భార్య పేరిట  ఐదెకరాల భూమి ఉన్నట్లు నిరూపిస్తే..ఆ భూమిని వాళ్లకే రిజిస్ట్రేషన్ చేయిస్తానని అన్నారు.