Astrology : జూలై 12న వృషభ రాశిలోకి కుజుడు.. ఈ మూడు రాశులకు కలిసొస్తుందా..!

నాయకత్వ లక్షణాలకు, యుద్ధానికి అధిపతి అయిన కుజుడు జులై 12వ తేదీన వృషభ రాశిని బదిలీ చేయబోతున్నాడు. గురుడు, కుజుడి కలయిక కూడా ఈ రాశిలో జరుగుతోంది. వృషభరాశిలో 45 రోజులు కుజుడు ఉంటాడు. తర్వాత ఆగస్టు 26వ తేదీన మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల మూడు రాశులవారికి సుడి తిరగనుంది. దక్కనున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం

భూమికి విష్ణుమూర్తికి పుట్టిన కొడుకు ని కుజుడుగా జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.  ఇది నవగ్రహాలలో నాల్గవ గ్రహం. దీనినే అంగారకుడు  అని కూడా పిలుస్తాం. విష్ణుమూర్తి చెమట చుక్క నుంచి ఉద్భవించిన అంగారకుడు.. తన తపస్సుతో బ్రహ్మను మెప్పించి గ్రహంగా మారినట్లు బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది.గ్రహాలకు అధిపతి అయిన కుజుడు జులై 12 నుంచి 45 రోజులపాటు వృషభరాశిలో సంచరించనున్నాడు. ఈ కారణంగా మేషం నుంచి మీన రాశివరకూ దీని ప్రభావం ఉంటుంది. భూమి పుత్రుడైన అంగారకుడి రాశిమార్పు.. 2024లో ద్వాదశ రాశుల వారికి స్నేహ భావాన్ని కలిగిస్తుంది. అయితే మేషం, వృషభం, కుంభ రాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఆ రాశులతో పాటు మిగతా రాశులకు  జ్యోతిష్య నిపుణులు తెలిసిన వివరాల ప్రకారం ఎలా ఉంటుందో చూద్దాం. . .

మేషరాశి : ఈ రాశి వారికి కుజుడు .. వృషభ రాశిలో సంచరించడం వలన చాలా ప్రయోజనాలుంటాయి.  ప్రతి పనిలోనే విజయం సాధిస్తారు.  మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. వ్యాపారంలో అమితంగా లాభాలుంటాయి. ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంటుంది.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. మీ వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. తీర్థయాత్రలకు వెళతారు. సంతోషంగా ఉండేందుకు డబ్బును ఎంతైనా ఖర్చుచేయడానికి సిద్ధపడతారు. జీవిత భాగస్వామితోపాటు కుటుంబంలోని ఇతర సభ్యులతో కూడా సంబంధాలు బాగుంటాయి.

వృషభరాశి:  ఈ రాశిలో  కుజుడి సంచారం  వృషభ రాశివారికి శుభ ఫలితాలను ఇస్తుంది. కష్టంతో విజయాన్ని సాధిస్తారు. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారులు లాభపడుతారు. ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం, సంతోషం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయి. అత్త మామల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. వ్యాపారాన్ని విస్తరించేందుకు కొత్త వ్యూహాలను రచిస్తారు. డబ్బు ఎక్కడైనా నిలిచిపోతే వాటిని తిరిగి పొందుతారు. 

మిధునరాశి:  కుజుడు వృషభరాశిలో సంచరిస్తున్నప్పుడు మిధున రాశి వారికి అనుకోని  ఖర్చులు, ఇబ్బందులు ఎదురవుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి రుణ లావాదేవీలను జరపవద్దని సూచిస్తున్నారు.  విదేశీ వ్యాపారులకు స్వల్ప ప్రయోజనాలుంటాయి.  జలుబు, దగ్గు మొదలైన శారీరక రుగ్మతలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. పూర్వీకుల విషయాలలో నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుందని సంకేతాలు వస్తాయి.  ఎవరితోనూ ఎక్కువుగా మాట్లాడకండి.  ఎదుటి వారితో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.  ఆర్థిక సమస్యలు వెంటాడిన చివరి నిమిషంలో డబ్బు చేతికందుతుంది.  కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది.  ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందడానికి సుందరాకాండ పారాయణ చేయడం కాని.. వినడం కాని చేయండ.  
 
కర్కాటక రాశి: ఈ  రాశి వారికి వృషభ రాశిలో కుజుడు సంచరిస్తున్నప్పుడు అనుకోని ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయి. సంపదకు సంబంధించిన సమస్యలు ఉండవు. వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు.  వ్యాపారంలో విజయావకాశాలు ఉన్నాయి.  అయినా అనుకోని ఖర్చులు రావడంతో ఆర్ధికంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సంతానం మరియు కొత్త జంటను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి.కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది.  మానసిక అనారోగ్యం కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇష్ట దైవాన్ని  ధ్యానం  చేయండి. 

సింహరాశి: వృషభ  రాశిలో కుజ గ్రహ సంచారం వలన సింహ రాశి వారికి  ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. పెద్ద పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆస్తిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరుతుంది. అదృష్టం తోడుంటుంది. మతపరమైన కార్యక్రమాలపట్ల అనురక్తి కలుగుతుంది. వ్యాపారం, ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మీరు కుటుంబం , వైవాహిక జీవితంలోని అన్ని బాధ్యతలను చూసుకుంటారు . ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 

కన్యారాశి: ఈ రాశివారు  వృషభ రాశిలో కుజ గ్రహం సంచారం వలన  విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  అన్ని రంగాల్లో  విజయం సాధిస్తారు. వివిధ మార్గాలద్వారా సంపదను పొందుతారు. సంపదను కూడబెడతారు. కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. కుటుంబంలో గొడవలు సమసిపోతాయి. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. నిలిచిపోయిన డబ్బును పొందుతారు. ఉద్యోగస్తులు , వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు . వారి కెరీర్‌లో కొత్త శిఖరాలకు చేరుకుంటారు. మీ జీవనశైలి మెరుగుపడుతుంది.

తులారాశి: ఈ రాశివారికి ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి.   డబ్బు సంపాదనకు కొత్త మార్గాలు తెరుచుకుంటారు. ఆర్థికంగా పరిస్థితి మెరుగపడుతుంది. వేతనాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు మంచి ప్రయోజనాలున్నాయి. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటారు. వ్యక్తిగత  వృత్తి జీవితంలో గొప్ప అవకాశాలు వస్తాయి . పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి .  మీరు మీ నాయకత్వ నైపుణ్యాలలో గొప్ప పెరుగుదలను చూస్తారు .  మీ కీర్తి   బాగా పెరుగుతుంది.  మీరు మీ భాగస్వామితో మీ సంబంధంలో మరింత ఆనందాన్ని కొనసాగించగలుగుతారు.

వృశ్చికరాశి :  వృషభరాశిలో కుజ సంచారం వలన వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంటుంది, కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే వాయిదా వేసుకోండి.  కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉన్నా.. డబ్బు వృధాగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి.  కొత్తగా ఆస్థిని కొనాలనుకుంటే కొద్ద రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. స్థలానికి సంబంధించిన వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇతరులను నమ్మకుండా.. మీ సొంత నిర్ణయాలు తీసుకోండి. సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు రుద్రభిషేకం  చేయించండి.. హనుమాన్​ చాలీసా చదవండి 

ధనుస్సు: కుజుడు మీ రాశి నుండి ఆరవ ఇంటిని బదిలీ చేస్తాడు. ఈ సమయంలో, ధనుస్సు రాశి వారు మంచి స్నేహితులను పొందుతారు . సోదరులు , సోదరీమణుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. ప్రజలు పనిలో మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది .మీరు కొత్త స్థానాన్ని పొందుతారు. మీరు మంచి మొత్తాన్ని ఆదా చేసుకోగలుగుతారు . మీ ధైర్యం పెరుగుతుంది, ఇది మీ నిర్ణయాత్మక సామర్థ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంది. వ్యాపారస్తులు మంచి లాభం , పురోగతిని పొందుతారు . ఇతర వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు.. వ్యాపారస్తులకు మంచి లాభంతోపాటు పురోగతి ఉంటుంది. 

మకరరాశి: ఈ రాశివారికి  కుజుడు వృషభరాశిలో ఉన్న సమయంలో  ఊహించని ఫలితాలు  ఇస్తాడని పండితులు చెబుతున్నారు.  కాంపిటేవివ్​ ఎగ్జామ్స్​ రాసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటేంది. కొత్త దంపతులకు సంతానయోగంతోపాటు ఆర్థికంగా వృద్ది చెందే అవకాశం ఉంది. అయితే ప్రేమకు సంబంధించిన విషయాల్లో  ఉదాసీనత ఉంటుంది.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ విషయంలో కష్టపడాల్సి ఉంటుంది.  ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఈ సమయం మిశ్రమంగా ఉంటుంది.

కుంభరాశి: ఈ రాశిలో పుట్టినవారికి అంగారక సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. భూమి కొనుగోళ్లు లేదా ఇంటి కొనుగోళ్లు చేస్తారు. కెరీర్ లో ఆర్థికంగా పురోగతి ఉంటుంది. విదేశాలకు వెళ్లేందుకు ప్రయాణించేవారికి సానుకూలంగా ఉండనుంది. ప్రయాణాలు చేయడం వల్ల ఆర్థిక లాభం వచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చి అనుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది.  కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం. సంపాదన పెరుగుతుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే సమయస్ఫూర్తితో పరిష్కరించుకోగలరు. 

మీనరాశి:  వృషభరాశిలో కుజ గ్రహం సంచారం వలన   మీన రాశి వారికి ధైర్యం పెరుగుతుంది.  కుటుంబ సభ్యుల నుండి ముఖ్యంగా తోబుట్టువుల నుండి మద్దతు ఉంటుంది . మరియు మీ ఆశయాలు ...  కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగానికి అనుకూల సమయం. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. సామాజిక సంస్థలలో పాల్గొంటారు ..  దానధర్మాలు కూడా చేస్తారు. విదేశీ ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది. అయితే జీవిత భాగస్వామికి ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చి.. డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది.