మంచు ఫ్యామిలీలో బిగ్ ట్విస్ట్: జనసేనలోకి మనోజ్, మౌనిక..!

గత పది రోజులుగా ఫ్యామిలీ వివాదంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్‎లో ఉన్న మంచు ఫ్యామిలీలో మరో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. నటుడు మోహన్ బాబు కొడుకు మనోజ్, కోడలు మౌనిక జనసేన పార్టీలో చేరబోతున్నట్లు తెలిసింది. ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో మనోజ్ దంపతులు జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నట్లు సమాచారం. 2024, డిసెంబర్ 16న ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. 

ఈ క్రమంలో 1000 కార్లతో భారీ కాన్వాయ్‎తో ఆళ్లగడ్డకు వెళ్లేందుకు మనోజ్ దంపతులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలు నిర్వహిస్తో్న్న భూమా ఘాట్‎లోనే మనోజ్ దంపతులు తమ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన కీలక ప్రకటన చేయనున్నట్లు టాక్. మనోజ్ భార్య మౌనిక ఫ్యామిలీకి కంచుకోట అయిన నంద్యాల నుంచే పొలిటికల్ ఇన్నింగ్స్ షురూ చేయాలని మనోజ్, మౌనిక భావిస్తున్నారట. 

తన తండ్రి, సోదరుడితో  వివాదం నెలకొన్న నేపథ్యంలో రాజకీయంగా బలపడాలని మనోజ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మనోజ్, మౌనిక సడెన్ డెషిషన్‎ సినీ, పొలిటికల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‎గా మారింది. మనోజ్ జనసేనలో చేరితే.. మంచు ఫ్యామిలీ విభేదాలు కొత్త టర్న్ తీసుకుంటాయని ప్రచారం జరుగుతోంది. 

Also Read:-రెయిన్ అలర్ట్.. ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు..

గత రెండు వారాలుగా మంచు ఫ్యామిలీలో విభేదాలు మరింత ముదిరిన విషయం తెలిసిందే. మోహన్ బాబు, విష్ణు వర్సెస్ మనోజ్‎గా గొడవలు జరుగుతున్నాయి. తన ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోవాలని మనోజ్‎ను మోహన్ బాబు హెచ్చరించగా.. మనోజ్ బలవంతంగా తన తండ్రి ఇంట్లోకి వెళ్లడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తన ఇంట్లో జరుగుతోన్న పరిణామాలను కవర్ చేసేందుకు వచ్చిన మీడియాపై మోహన్ బాబు దాడి చేయడంతో ఆయనపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు అయ్యింది. ఇలా గత పది రోజులుగా మంచు ఫ్యామిలీ పంచాయతీ రోడ్డెక్కింది.

ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం.. పోలీసులు పిలిచి మంచు ఫ్యామిలీ మెంబర్స్‎కు వార్నింగ్ ఇవ్వడం టాక్ ఆఫ్ ది టౌన్‏గా మారింది. ఫ్యామిలీ ఇష్యూ మరింత ముదిరిన సమయంలో మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి జనసేన పార్టీలో చేరనుండటం హాట్ టాపిక్‎గా మారింది. మోహన్ బాబు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీ మధ్య అస్సలు పడదని మూవీ సర్కిల్స్‎లో టాక్. అలాంటిది మనోజ్ వెళ్లి మెగా బ్రదర్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో చేరనుండటంతో మోహన్ బాబు ఏ విధంగా రియాక్ట్ అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.