స్కూల్​ ఎదుట అయ్యప్పస్వాముల ధర్నా

నాచారం, వెలుగు: నాచారంలోని సెయింట్​ పీటర్స్​ పాఠశాల యాజమాన్యం అయ్యప్ప మాల వేసుకున్న ఇద్దరు స్టూడెంట్స్ ను  క్లాసులోనికి అనుమతించలేదు.  విషయం తెలుసుకున్న అయ్యప్ప స్వాములు సోమవారం  పాఠశాలకు చేరుకుని పిల్లల తల్లిదండ్రులకు మద్దతుగా  స్కూల్​ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  పాఠశాల యజమాన్యం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తుందని మండిపడ్డారు.  

గతంలోనూ ఈ పాఠశాల ఇదే విధంగా వ్యవహరించిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలు చేసినా వారి తీరు మాత్రం మారడం లేదన్నారు.  మాల వేసిన సమయంలో స్కూల్​యూనిఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రావాలంటూ ఆంక్షలు విధించడం సరైంది కాదన్నారు. నాచారం పోలీసులు పాఠశాలకు చేరుకుని  స్కూల్ యాజమాన్యంతో చర్చించారు. పోలీసులు జోక్యంతో విద్యార్థులను పాఠశాలకు అనుమతి ఇవ్వడంతో అయ్యప్ప స్వాములు,విద్యార్థుల తల్లిదండ్రులు  ఆందోళన విరమించారు.