కొడుకులపై కోపంతో కుక్కుకు ఆస్తిని రాసిచ్చేశాడు

కొడుకులపై కోపంతో కుక్కుకు ఆస్తిని రాసిచ్చేశాడు
చింద్వాడా: కన్న కొడుకులను కాదని పెంపుడు కుక్కకు సగం ఆస్తిని రాచిచ్చాడో వ్యక్తి. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లా, బరిబాడ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఓం నారాయణ అనే రైతు ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. ఆస్తి పంపకాలకు సంబంధించి తన కుమారులతో విభేదాలు ఉండటంతోపాటు వారి ప్రవర్తన నచ్చకపోవడంతో నారాయణ ఆస్తిని పెంపుడు కుక్కకు రాసిచ్చాడు. తన భార్య, పెంపుడు కుక్క మాత్రమే తనను బాగా చూసుకుంటున్నారని.. అందుకే ఆస్తిని వారిద్దరి పేర్లపై రాస్తున్నానని తెలిపాడు. తాను చనిపోయిన తర్వాత తన ఆస్తి మొత్తం తన భార్య, కుక్కకే చెందుతుందని చెప్పాడు. పెంపుడు కుక్కను ఎవరు బాగా చూసుకుంటారో దాని పేరున ఉన్న ఆస్తికి వారే వారసులని పేర్కొనడం గమనార్హం