ముంబై: మహిళ అనుమతి లేకుండా ఆమె పాదాలనే కాదు బాడీలో ఏ పార్ట్టచ్చేసినా..ఆమె గౌరవానికి భంగం కలిగించడమేనని బాంబే హైకోర్టు స్పష్టంచేసింది. తాను మహిళ పాదాలను మాత్రమే టచ్చేశానని, కింది కోర్టులో వేసిన శిక్షను సవాలు చేస్తూ ఓ నిందితుడు బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్పై జస్టిస్ఎంజీ సెవ్లికర్ ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ చేపట్టింది. మహారాష్ట్రలోని జల్నా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 2014 జూలైలో అర్ధరాత్రి వేళ తన భర్త ఇంట్లో లేని సమయంలో తన పాదాలను తాకాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు 2015 జూన్లో జల్నా సెషన్స్ కోర్టు నిందితుడిని దోషిగా తేలుస్తూ.. ఏడాది జైలు శిక్ష విధించింది. దీనిపై నిందితుడు బాంబే హైకోర్టుకు వెళ్లాడు. తన క్లయింట్ లైంగిక ఉద్దేశంతో ఆమె పాదాలను తాకలేదని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. ఈ వాదనలతో సంతృప్తి చెందని కోర్టు.. నిందితుడు అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించి, మహిళ అనుమతి లేకుండా పాదాలను తాకడం చూస్తుంటే.. లైంగిక ఉద్దేశంతోనే ఆ పని చేసినట్లు తెలుస్తోందని పేర్కొంది. మహిళ అనుమతి లేకుండా పాదాలను కాదు.. బాడీలోని ఏ పార్ట్టచ్చేసినా ఆమె గౌరవానికి భంగం కలిగించినట్లేనని కోర్టు అభిప్రాయపడింది. కింది కోర్టు తీర్పును సమర్థించిన బాంబే హైకోర్టు.. నిందితుడి పిటిషన్ను కొట్టేసింది.
