చెన్నై: భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కాలేయ, మూత్రపిండాల మార్పిడిని విజయవంతంగా సుప్రసిద్ధ గ్లెనీగల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ (జీజీహెచ్‌సీ) . కోవిడ్–19 భారతదేశంలో వ్యాప్తి చెందుతున్న వేళ, ఇద్దరు దాతల సహాయంతో ఈ శస్త్రచికిత్స చేశారు.
ఢిల్లీకి చెందిన మిట్టల్(35) అనే వ్యక్తి కి మూత్రపిండాలు విఫలం కావడంతో పాటు తీవ్రమైన కాలేయ సమస్యలు (ఫ్యాటీ లీవర్) ఉన్నాయి. న్యూఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో ఆయనకున్న అతి తక్కువబీపీ, కార్డియాక్ షాక్ వంటి సమస్యలు కారణంగా వీటి మార్పిడి వెల్లడించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలోని జీజీహెచ్‌సీ హాస్పిటల్‌లో చేర్పించారు.
జీజీహెచ్‌సీ బృందం ఆయనను పరిశీలించి కీడ్నీ, లివర్ సమస్యలతో పాటు.. పలు సమస్యలు కూడా ఉన్నాయని గుర్తించి ప్రత్యేకమైన లీవర్ ఐసీయులో రెండు వారాలు ఉంచి అవసరమైన చికిత్స అందించారు. దీనితో పాటుగా 3–4 రోజులు 24గంటలూ డయాలిసిస్ చేశారు. జీజీహెచ్‌సీ క్రిటికల్ కేర్ బృందం 14 గంటల పాటు కష్టపడి , విజయవంతంగా ఈ రెండు అవయవాల మార్పిడి చేశామని గ్లెనీగల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ డైరెక్టర్ డాక్టర్ జాయ్ వర్గీస్ అన్నారు. శస్త్రచికిత్స జరిగిన 16 వ రోజున రోగిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని, రోగితో పాటుగా అతని సోదరి, భార్య కూడా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
