సీఎం జగన్ పై రాయితో దాడి జరిగి 24గంటలు కూడా గడవక ముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి జరిగింది. తెనాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ రాయితో దాడి చేశాడు ఒక ఆకతాయి. అయితే, ఆ రాయి వారాహి వాహనానికి దూరంగా పడటంతో కార్యకర్తలు, ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ఆకతాయిని గుర్తించి దేహశుద్ది చేసిన జనసైనికులు అతన్ని పోలీసులకు అప్పగించారు.
తెనాలిలోని సుల్తానాబాద్ నుండి గాంధీ మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తెనాలిలో ప్రయతిస్తున్న పవన్ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజల ముందు ఉంచనున్నారు. ర్యాలీ అనంతరం పవన్ రైతులు, నిరుద్యోగులతో ముఖాముఖిలో పాల్గొననున్నారు.అయితే, పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి ఆకతాయి పనేనా లేక దీని వెనుక ప్రత్యర్థుల హస్తం ఉందా అన్నది తెలియాల్సి ఉంది.