మహిళ హత్య కేసులో వ్యక్తికి జీవిత ఖైదు

 గండిపేట, వెలుగు: అక్రమ సంబంధం పెట్టుకొని వివాహితను హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు పడింది. వివరాల్లోకి వెళ్తే.. తన భర్తతో గొడవపడి జ్యోతి(35) అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి అత్తాపూర్​పరిధిలోని రాంబాగ్​లో నివాసం ఉంటోంది. ఆమెకు పెండ్లికాక ముందు తన స్వగ్రామానికి చెందిన మరో వ్యక్తి శ్రీకాంత్‌‌‌‌తో పరిచయం ఉంది. శ్రీకాంత్‌‌‌‌ అప్పుడప్పుడు జ్యోతి ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. 

ఈ క్రమంలోనే తన భార్యను వదిలిపెట్టి, శ్రీకాంత్​ను తనతోనే ఉండాలని జ్యోతి వేధించడం మొదలుపెట్టింది. దీంతో ఎప్పటికైనా తనకు జ్యోతితో ముప్పు ఉంటుందని భావించిన శ్రీకాంత్.. 2019లో ఆమెను హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి, చార్జ్​షీట్ దాఖలు చేశారు. 

నేరం రుజువు కావడంతో ఎల్బీనగర్‌‌‌‌ 4వ అడిషనల్‌‌‌‌ కోర్టు న్యాయమూర్తి జె.కవిత నిందితుడికి జీవితఖైదుతో రూ.3 వేల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించారు.