నల్లమలలో ఒకరు మిస్సింగ్..గాలించినా దొరకని జాడ 

అమ్రాబాద్, వెలుగు :  శ్రీశైలం వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి బయలు దేరిన వ్యక్తి నల్లమలలో మిస్సింగ్ అయ్యాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం వర్త్య తండాకు చెందిన మాడెం యాదయ్య (34) ఈనెల 14 న శ్రీశైలం వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి బయలు దేరాడు. కాగా మన్ననూరు సమీపంలో దార బేస్ క్యాంప్ సమీపంలో అతని బైక్, హెల్మెట్, మొబైల్, జర్కిన్, పడి ఉండడం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

అప్పటికే రెండు రోజులైనా భర్త ఫోన్ కలవకపోవడంతో భార్య, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో పోలీసులు గురువారం అడవిలో గాలింపు ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం నుంచి రాత్రి వరకు వెతికినా ఆచూకీ తెలియలేదు. దీంతో పలు కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.