వీడికి భూమ్మిద నూకలు ఉన్నాయి..రైలు కింద పడ్డా..చిన్న గాయం కాకుండా బయటపడ్డడు

వీడికి భూమ్మిద నూకలు ఉన్నాయి..రైలు కింద పడ్డా..చిన్న గాయం కాకుండా బయటపడ్డడు

రైలు కింద పడితే ఏమవుతుంది..? ఇంకేమవుతుంది. శరీరం నుజ్జు నుజ్జవడం ఖాయం. కానీ బీహార్లో మాత్రం ఓ వ్యక్తి చిన్న గాయం కూడా కాలేదు. పైగా నవ్వుతూ రైలు కింద నుంచి లేచి ఫ్లాట్ ఫాంపై వచ్చాడు. వివరాల్లోకి వెళ్తే..

బీహార్ లోని బగాహ రైల్వే స్టేషన్ లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే కాలు జారి ఫ్లాట్ ఫారానికి మధ్య ఉన్న గ్యాప్ లో పడిపోయాడు. ఈ సమయంలో రైలు 120 స్పీడ్ లో వెళ్తోంది. రైలు వెళ్లేంత వరకు అలాగే గ్యాప్ లో నక్కిన ఆ వ్యక్తి..రైలు వెళ్లిపోగానే నవ్వుతూ ఫ్లాట్ ఫారం పైకి వచ్చాడు. 

Also Read :- అక్టోబర్ నెలలో బ్యాంకు సెలవులు ఇవే

బాధితుడు రైలు కింద పడిపోవడాన్ని అక్కడే ఉన్న రైల్వే పోలీస్, ఇతర ప్రయాణికులు గమనించారు. అయితే రైలు వెళ్తున్న సమయంలో అతనికి పలు సూచనలు చేశారు. అలాగే ఉండు..బయటకు రాకు..అంటూ ధైర్యం చెప్పారు.  రైలు వెళ్లాక..రైల్వే పోలీసులు, ఇతర ప్రయాణికులు అతన్ని ఫ్లాట్ ఫారం పైకి లాగారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.