యూపీలో తండ్రి సహకారంతో యువకుడి కిరాతకం.. తల్లినీ, నలుగురు అక్కా చెల్లెళ్లను క్రూరంగా చంపేసిన యువకుడు..

న్యూ ఇయర్ వేళ ప్రపంచం అంతా సంబరాల్లో మునిగిపోతే.. ఒక కుటుంబంలో తల్లీ, నలుగురు కూతుళ్లు విగత జీవులు అయ్యారు. కొత్త సంవత్సరం ముందు సంతోషంగా గడపాల్సిన తల్లి కొడుకు చేతిలో దారుణ హత్యకు గురైంది. న్యూ ఇయర్ ముందు అన్నతో కలిసి ఎంజాయ్ చేయాల్సిన చెల్లెళ్లు.. అన్నయ్యే కాల యముడు అవుతాడని ఊహించక అందరాని లోకాలకు వెళ్లిపోయారు. 

ఇరుగు పొరుగు వారి వేధింపుల నుండి, తన కమ్యూనిటీలో ఉన్న మగ వారి నుండి తన ఇంటి ఆడవాళ్లకు రక్షణ కల్పించలేక పోతున్నానని ఒక దుర్మార్గుడు ఐదుగురిని కిరాతకంగా చంపేశాడు. తన ఇంటి ఆడవాళ్ల గౌరవం కాపాడేందుకే ఈ హత్యకు పాల్పడుతున్నట్లు వీడియో రిలీజ్ చేశాడు. మద్యం తాగించీ.. చున్నీతో గొంతు బిగించి.. నోట్లో గుడ్డలు కుక్కి.. మణికట్టు కోసి అతి కిరాతకంగా హతమార్చాడు ఈ దుర్మార్గుడు.

ఈ దారుణమైన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో చోటు చేసుకుంది. అర్షద్ అనే దుర్మార్గుడు కుటంబంతో అజ్మీర్ వెళ్లి వస్తుండగా.. లక్నో హోటల్ లో బస చేస్తుండగా ఈ హత్యకు పాల్పడ్డాడు. విచిత్రం ఏమిటంటే ఈ హత్యకు తండ్రి సహకరించడం. తండ్రి సహకారంతోనే తమ ఆడపడుచులను చంపేశానని చెప్పాడు. ఆగ్రాకు చెందిన కుటుంబం.. న్యూ ఇయర్ వేడుకల కోసం అజ్మీర్ వెళ్లి వస్తుండగా లక్నో హోటల్ లో ఈ దారుణానికి ఒడిగట్టారు ఈ తండ్రీ కొడుకులు.

లక్నో హోటల్ లో జరిగిన దారుణ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అర్షద్ ను అరెస్టు చేశారు. తన తల్లిని, అక్కా చెల్లెళ్లను తానే చంపినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. మృతులలో అర్షద్ అక్కా చెల్లెళ్లు అలియా(9), అలిషియా(19), అక్సా(16), రహీమన్(18) తో పాటు తల్లి అస్మా ఉన్నారు. హత్య అనంతరం అర్షద్ చనిపోయి ఉన్న వాళ్ల మృతదేహాలను చూపుతూ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 

హత్య అనంతరం వీడియో విడుదల చేసిన హసన్.. హత్యకు గత కారణాలను తెలిపాడు. తమను బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారిగా ప్రచారం చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తప్పుడు కేసులలో ఇరికించాలని చూస్తు్న్నారని వీడియోలే తెలిపాడు. 

తన కుటుంబాన్ని తమ కమ్యూనిటీ వేధించిందని, చాలా రాత్రులు ఫుట్ పాత్ ల మీద గడిపామని.. పోలీసులు గానీ, నాయకులు గానీ తమ గురించి పట్టించుకోలేదని వీడియోలో తెలిపాడు. తమ కమ్యూనిటీ నుంచి ఇబ్బంది ఉందని, గౌరవం కాపాడుకోవడానికే చంపేస్తున్నట్లు చెప్పాడు. 

కుటుంబ గౌరవం కాపాడుకోవాలంటే ఎదిరించి పోరాడాలి కానీ.. అందరినీ ఒకే సారి చంపేస్తే గౌరవం వస్తుందా అని ఈ హత్య గురించి తెలిసిన వాళ్లు అంటున్నారు. కన్న తల్లినీ, తోడబుట్టిన ఆడపడుచులను ఎలా చంపాలనిపించిందనీ ప్రశ్ని్స్తున్నారు. విగత జీవులైన తల్లీ, బిడ్డలను చూసీ స్థానికులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.     

మృతదేహాలను పోస్ట్ మార్టంకు పంపామని, పోస్ట్ మార్టం నివేధిక వస్తే పూర్తి వవరాలు బయటపడతాయని లక్నో పోలీసులు పోలీసులు తెలిపారు. 

ఈ ఘటనప సమాజ్ వాది పార్టీ అధికార ప్రతినిధి ఫఖ్రుల్ హసన్ చంద్ స్పందించారు. నిరుద్యోగం, పేదరికం, తీవ్ర ఒత్తిడి కారణంగా అభద్రతా భావంతో ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చునని అన్నారు.