కీసరలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి

కీసర, వెలుగు: మేడ్చల్ జిల్లా కీసర పరిధిలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఒకరి ప్రాణం తీసింది. రాంపల్లి నుంచి చర్లపల్లి వెళ్లే మార్గంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా రోడ్డు అడ్డగా మట్టికుప్పలు పోశారు. అయితే, బుధవారం బైక్​పై అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి రాత్రిపూట మట్టికుప్పలు కనిపించకపోవడంతో కిందపడ్డాడు. 

తలకు తీవ్ర గాయం కావడంతో స్పాట్​లోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడిని రాంపల్లి గ్రామానికి చెందిన అంకర్ల శివ కుమార్​గా గుర్తించారు.