మెట్రోలో ఫొటోలు తీసిన ప్రయాణికుడు..కోపంతో ఊగిపోయిన మహిళ..పోలీసులకు ఫిర్యాదు 

అతనికి ఫొటోలు తీయడం సరదానో లేక మెట్రోలో కిక్కిరిసిన జనం ఉండటంతో ఆశ్చర్యంతో తీశాడో తెలియదు కానీ.. ఓ వ్యక్తి క్రౌడ్​ ఫొటోలు తీయడం పెద్ద వివాదాస్ప దమైంది..నా ఫొటోలే తీస్తావా అంటూ ఆ క్రౌడ్​ లో ఉన్న మహిళ కోపంతో ఊగిపోయింది.. అతన్ని ఎడా పెడా మాటలతో వాయించింది. అంతటితో ఆగక పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.  

డిసెంబర్​ 30, 2024..కొత్త సంవత్సరం సమీపిస్తున్న సమయం కూడా..దీంతో బెంగళూరు మెట్రో స్టేషన్లు, మెట్రోరైళ్లు జనంతో కిక్కిరిసి పోయాయి. క్రౌడ్​ ఎన్నడూ ఇసుక వేస్తే రాలనంతగా ఉంది.. దీంతో కొంత ఆశ్యర్యానికి గురైన మహేష్​ అనే ప్రయాణికుడు జనాన్ని ఫొటోలు తీయడం మొదలు పెట్టాడు.. అదే పెద్ద వివాదమైంది.. అతన్ని పోలీస్​ స్టేషన్​ కు ఈడ్చింది. 

ALSO READ | మైండ్ బ్లోయింగ్: ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డుకు.. పల్టీలు కొట్టుకుంటూ వచ్చిన స్కూల్ బస్సు

మహేష్​ అనే వ్యక్తి కదులుతున్న మెట్రో రైలులో జనరల్​ గా ఫొటో తీస్తున్నాడు..అది గమనించిన ఓమహిళ మహేష్​ పై విరుచుకుపడింది. ఓ రేంజ్​ లో తిట్ల దండకం అందుకుంది. ఫొటోలు ఎందుకు తీస్తున్నావు..అందులో నా ఫొటోలు కూడా ఉన్నాయి.. వెంటనే డిలిట్​ చేయాలని అని కోపంతో  ఊగిపోయింది.. ఆమె 112 కి కాల్​ చేయడంతో పోలీసులు ఇద్దరిని పోలీస్​ స్టేషన్​ కు తీసుకెళ్లారు. 

అయితే అతను ఎలాంటి అభ్యంతర కరమైన ఫొటోలు తీయలేదు.. అయితే ఆమె తన ఫొటోను తొలగించాలని కోరింది.. నాక్​ కాగ్నిజబుల్​ రిపోర్టు దాఖాలు చేసిన పోలీసులు తెలిపారు. అయితే మహేష్​ ఇంతకు ముందు మహిళలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలాంటి ఏమైనా తీశాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.