మహబూబ్ నగర్ జిల్లా సహకార బ్యాంకు నూతన చైర్మన్​గా మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నూతన చైర్మన్ గా  వనపర్తి జిల్లాకు చెందిన మామిళ్ల పల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.  చైర్మన్ పదవి కోసం డైరెక్టర్​ మామిళ్లపల్లి విష్ణువర్ధన్​ రెడ్డి ఒకే  ఒక నామినేషన్​ రావడంతో ఎన్నిక  ఏకగ్రీవం అయింది. 

ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్మన్ కు ఎన్నికల నిర్వహణ అధికారి టైటస్ పాల్  నియామక పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా  ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, పర్ణిక రెడ్డి, వాకిటి శ్రీహరి, జి.మధుసూదన్ రెడ్డి, మేఘరెడ్డి నూతనంగా ఎన్నికైన చైర్మన్​కు  శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు మెరుగైన సేవలను అందించాలని కోరారు.