దీదీ ఆత్మపరిశీలన చేస్కో

దీదీ ఆత్మపరిశీలన చేస్కో

కోల్ కతా: బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇప్పటికైనా దీదీ ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన హితవు పలికారు. 'గత పదేళ్లలో దీదీ పాలన అస్సలు బాగోలేదు. ప్రజాలు తనకు వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని ఆమె గ్రహించాలి. బెంగాల్ లో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అవినీతి హెచ్చు స్థాయిలో ఉంది. అక్రమ చొరబాట్లు అడ్డుకోవడంలో ఆమె విఫలమయ్యారు' అని షా పేర్కొన్నారు. కేంద్ర బలగాలపై దీదీ చేస్తున్న ఆరోపణలను బట్టి ఆమె ఓటమి ఖాయమైందనీ షా చెప్పారు. మమత రిగ్గింగ్ చేసి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు.