కాంగ్రెస్ వస్తేనే మరిన్ని పథకాలు : మల్లు రవి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: కాంగ్రెస్  పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే మరిన్ని పథకాలు అమలు చేస్తామని నాగర్ కర్నూల్  ఎంపీ క్యాండిడేట్​ మల్లు రవి తెలిపారు.ఆదివారం తెల్కపల్లి, తాడూరు, నాగర్ కర్నూల్ లో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డితో కలిసి కార్నర్  మీటింగ్​లో పాల్గొన్నారు. అంబేద్కర్  విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పదేండ్లుగా బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడంలో విఫలమయ్యాయని విమర్శించారు. 

పార్టీ గెలుపులో భాగస్వాములు కావాలి..

కాంగ్రెస్  పార్టీ ఎంపీ క్యాండిడేట్లను గెలిపించడంలో యువత ముందుండాలని యూత్  కాంగ్రెస్  రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని  సాయి గార్డెన్​లో నిర్వహించిన యువ సమ్మేళనంలో ఎంపీ క్యాండిడేట్​ మల్లురవి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎంపీ క్యాండిడేట్లు యువకులేనన్నారు. కాంగ్రెస్  పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం నిర్వహించాలని కోరారు. అసెంబ్లీ ఇన్​చార్జి అనితా రెడ్డి, హబీబ్, సునేంద్ర పాల్గొన్నారు.