కాశ్మీర్‌పై మలేషియా ప్రధాని ఆరోపణలు

కాశ్మీర్‌పై మలేషియా ప్రధాని ఆరోపణలు

ఆర్టికల్‌ 370 రద్దు చేసినప్పటి నుంచి  పాకిస్తాన్ భారత్‌పై వ్యతిరేక స్వరం వినిపిస్తూనే ఉంది. తనకు మద్దతు ఇచ్చే దేశాలను కూడగట్టుకుని, భారత్‌ నిర్ణయంపై  ఆరోపణలు చేస్తూనే ఉంది. కశ్మీరు అంశంలో భారత్‌పై వ్యతిరేక స్వరం వినిపిస్తున్న పాక్ కు ఇప్పటికే  చైనా, టర్కీ మద్దతిస్తున్నాయి. వీటికి తోడు మలేషియా జత కలిసింది.

జమ్మూ-కశ్మీర్‌ను భారత్‌ ఆక్రమించిందని ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో మలేషియా ప్రధాని మహతిర్‌ మహమ్మద్‌ ఆరోపణలు చేశారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 5న రష్యాలో మోడీతో భేటీ సందర్భంగా కశ్మీర్‌ అంశాన్ని ఆక్రమణ ద్వారా కంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించినట్లు  మహమ్మద్‌ తెలిపారు.

మహమ్మద్‌ భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా వివాదాస్పద మత ప్రభోధకుడు జకీర్‌ విషయంలోనూ ఇలాగే మాట్లాడారు.