డ్రగ్స్ కేసులో ఒకప్పటి హీరోయిన్ పేరు... హోటల్ కి వెళ్లడంతో...

గ్యాంగ్‌స్టర్ ఓంప్రకాష్‌కి సంబంధించిన డ్రగ్స్ కేసు కేరళ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. దీంతో పోలీసులు ఈ కేసుని మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. అయితే ఈ డ్రగ్స్ కేసులో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రయాగ మార్టిన్ కూడా ఉన్నట్లు పలు వార్తలు బలంగా వైరల్ అవుతన్నాయి. అంతేగాకుండా కొచ్చిలోని ఓంప్రకాష్ హోటల్ గదిని సందర్శించిన వారిలో నటులు ప్రయాగ, శ్రీనాథ్ భాసి ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.

దీంతో ఇటీవలే నటి ప్రయాగ మార్టిన్ స్పందించింది. ఇందులో భాగంగా తనకి ఓం ప్రకాష్ ఎవరో కూడా తెలియదని ఈ క్రమంలో ఓ రిపోర్టర్ ఈ డ్రగ్స్ మరియు ఓం ప్రకాష్ గురించి అడిగిన సమయంలో గూగుల్ లో వెతికి తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది. అలాగే తాను కొచ్చిలోని హోటల్ కి తన స్నేహితులను కలవడానికి వెళ్లానని పేర్కొంది. పోలీసుల విచారణకి కచ్చితంగా సహకరిస్తానని వెల్లడించింది

ALSO READ | జస్ట్ మిస్ : యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్...

ఇక ప్రస్తుతం తాను సినిమా ఇండస్ట్రీలో రీ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నానని అలాగే తనకి డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని చెప్పింది. ఈ క్రమంలో ఫుడ్ డైట్ పాటిస్తూ కేవలం శాకాహారం మాత్రమే తీసుకుంటున్నానని తెలిపింది.

ఈ విషయం ఇలా ఉండగా ఓం ప్రకాష్ మరియు అతని స్నేహితుడు షిహాస్‌ను శనివారం కొచ్చిలోని కుందన్నూర్‌లోని హోటల్‌లో డ్రగ్స్ గురించి పక్కా సమాచారంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో కొకైన్ మరియు నాలుగు లీటర్ల మద్యంతో కూడిన జిప్‌లాక్ కవర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.