మలబార్ 2024 సముద్ర విన్యాసాలు

విశాఖపట్టణంలో 28వ ఎడిషన్​ మలబార్ సముద్ర విన్యాసాలు అక్టోబర్ 14న ప్రారంభమయ్యాయి. ఈ విన్యాసాల్లో క్వాడ్​ సమాఖ్య సభ్య దేశాలు పాల్గొంటున్నాయి. ఈ విన్యాసాలను రెండు దశల్లో నిర్వహించనున్నారు. తొలి దశ హార్బర్​, రెండో దశ సముద్రంలో నిర్వహిస్తారు. 

క్వాడ్​ దేశాలైన ఆస్ట్రేలియా, భారత్​, జపాన్, అమెరికా దేశాల మధ్య సముద్ర సంబంధిత వ్యవహారాల్లో పరస్పరం సహకరించుకోవడం, సాంకేతిక సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, కలిసి కార్యక్రమాలు నిర్వహించం, ప్రాదేశిక భద్రత, ఇండో – పసిఫిక్​ ప్రాంతంలో సుస్థిరతకు ఈ విన్యాసాలు దోహదపడతాయి. అక్టోబర్ 18న మలబార్ విన్యాసాలు ముగుస్తాయి.