రాహుల్​, సోనియాలకు  ఆదిలాబాద్​ జిల్లా వాసులు లేఖ

ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కాంగ్రెస్​ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్​ గాంధీకి లేఖ రాశారు.  ఇచ్చోడ  మండలం  ముఖరా (కే ) గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు,  ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. వారితో పాటుగా సీఎం రేవంత్​ రెడ్డికి కూడా లేఖ రాశారు.