మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు నిండు ప్రాణాలు తీసిన ధాన్యం కుప్పలు..

మనోహరబాద్: మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం పోతారం వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను వాటర్ ట్యాంకర్ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన నలుగురూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం మరింత శోచనీయం. ఆంజనేయులు, లత, సహస్ర, స్వాతి ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

ఆంజనేయులు అనే వ్యక్తి తన తమ్ముడి భార్య, పిల్లలను బస్ ఎక్కించడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోతారం దగ్గర రోడ్డుపై కొందరు రైతులు ధాన్యం ఆరబోశారు. రోడ్డుపై ధాన్యం కుప్పలుగా పోసి ఉండటంతో ఒక వైపు నుంచే వాహనాలు వస్తూపోతూ ఉన్నాయి. బైక్పై వెళుతున్న ఈ నలుగురినీ ఎదురుగా వచ్చి వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.