విజయవాడ బెంజ్ సర్కిల్ లో అగ్నిప్రమాదం

విజయవాడ బెంజ్ సర్కిల్ లో అగ్నిప్రమాదం

విజయవాడ: బెంజ్ సర్కిల్లో ఉన్న రిలయన్స్ ట్రెండ్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం షాపులన్నీ తెరుస్తున్న సమయంలో మొదటి అంతస్తులోని రిలయన్స్ ఫుట్ ప్రింట్స్ విభాగంలో మంటలు మొదలయ్యాయి. దట్టంగా పొగలు కమ్ముకోవడం గుర్తించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి మంటలు ఆర్పారు. ఐదు ఫైరింజన్లను రంగంలోకి దింపడం వల్ల మంటలు వెంటనే అదుపులోకి వచ్చాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. దాదాపు 2 నెలలకుపైగా లాక్ డౌన్ వల్ల వైరింగ్ మరమ్మత్తులు గుర్తించలేకపోవడం షార్ట్ సర్క్యూట్ కు దారితీసినట్లు తెలుస్తోంది. మొదటి అంతస్తులోని  వస్తువులు, చెప్పులు, షూలన్నీ మంటలకు కాలి పాడైపోయినట్లు సమాచారం.