పులివెందులలో 30 అడుగుల లోయలో పడిన పల్లెవెలుగు బస్సు

పులివెందుల: కడప జిల్లా పులివెందులలో బస్సు బోల్తా పడింది. కదిరి నుంచి పులివెందుల వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 

ఇవాళ ఉదయం (అక్టోబర్ 23, 2024) కదిరి నుంచి పులివెందుల వెళుతున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి అదుపు తప్పి 30 అడుగుల లోయలో పడింది. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు స్పాట్కు చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ నియోజకవర్గం పులివెందులే కావడం గమనార్హం.