మహిళా శక్తి క్యాంటీన్​ ప్రారంభం

మాగనూర్, వెలుగు: నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గుడేబల్లూరు టైరోడ్డు వద్ద ఆ గ్రామ లక్ష్మీమహిళా సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్​ను శుక్రవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మహిళా శక్తి క్యాంటీన్​ను ప్రారంభించేందుకు ముందుకు వచ్చిన గుడెబల్లూరు గ్రామ లక్ష్మీ మహిళా సంఘం సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గరీమా నరుల, డీఆర్డీఏ మొగులప్ప తదితరులు పాల్గొన్నారు.