నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీపై ఈడీ నమోదు చేసిన కేసులకు వ్యతిరేకంగా ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేపడుతున్నారు. అయితే.. ఈ ఆందోళనల్లో నేతలు ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. ఇటీవలే ఓ పోలీసు అధికారి కాలర్ ను రేణుకా చౌదరి పట్టుకున్న ఘటన మరిచిపోక ముందే మరొకటి చోటు చేసుకుంది. ఢిల్లీలోని పార్టీ కార్యకర్తలతో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజ నిరసనలో పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలతో పాటు ఆమెను అదుపులోకి తీసుకుని వ్యాన్ లోకి ఎక్కించారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆమెకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా పోలీసులపైకి ఆమె ఉమ్మి వేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై బీజేపీ స్పందించింది. ఇలా చేయడం సరికాదంటూ.. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి Shehzad Jai Hind వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
మరోవైపు.. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో రాహుల్ గాంధీపై ఈడీ చేపట్టిన విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 40 గంటలపాటు విచారణ చేపట్టిన ఈడీ అధికారులు... రాహుల్ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. మంగళవారం ఐదో రోజు ఈడీ అధికారులు రాహుల్ ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి పలు విషయాలపై ఈడీ అధికారులు రాహుల్ ను ప్రశ్నిస్తున్నారు. సోనియా గాంధీకి కరోనా సోకడంతో... ఆమెను చూసేందుకు ఆదివారం రాహుల్ ఈడీ అధికారుల నుంచి ఒక రోజు అనుమతి తీసుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న సోనియా... నిన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇదే కేసులో జూన్ 23 వరకు ఈడీ ముందు విచారణకు హాజరుకావాలని సోనియాగాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది.
#WATCH | Mahila Congress President Netta D'Souza spits at police personnel during a protest with party workers in Delhi against ED for questioning Congress leader Rahul Gandhi in the National Herald case. pic.twitter.com/cPBIntJq1p
— ANI (@ANI) June 21, 2022
Shameful & Disgusting
— Shehzad Jai Hind (@Shehzad_Ind) June 21, 2022
After beating up cops in Assam, holding their collar on Hyderabad now Mahila Congress President Netta Dsouza spits at cops & women security personnel merely because Rahul is being questioned by ED for corruption
Will Sonia,Priyanka & Rahul act on her? https://t.co/IP1gKibMR9 pic.twitter.com/F2pSSGx1jw
