Mahesh Babu: డబ్బింగ్ చెప్పడం అద్భుతమైన అనుభవం.. ముఫాసా రిలీజ్కి ముందు మహేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

ముఫాసా: ది లయన్ కింగ్ (Mufasa The Lion King) మూవీకి సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) డబ్బింగ్ చెప్పడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ హాలీవుడ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 20న థియేటర్లలోకి వస్తోంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ముఫాసా రిలీజ్కి ముందు మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. "ముఫాసాకు డబ్బింగ్ చెప్పడం ఒక అద్భుతమైన అనుభవం. నేను ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటాను. ముఫాసా: ది లయన్ కింగ్ కోసం నేను అనుభవించిన ఆనందాన్ని మీరు కూడా అనుభవిస్తారని ఆశిస్తున్నాను" అంటూ మహేష్ చేసిన ట్వీట్ ఫ్యాన్స్ను ఆకర్షిస్తోంది.

ఇటీవలే మహేష్ బాబు కుమార్తె సితార ఇంస్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో మాట్లాడుతూ.. ‘ముఫాసా పాత్రకి నాన్న డబ్బింగ్ చెప్పడం చాలా థ్రిల్లింగ్‌గా.. గర్వంగా ఉందని తెలిపింది. ముఫాసా ఒక ఐకానిక్ క్యారెక్టర్ కాబట్టి.. అందుకు నాన్న వాయిస్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించిందని సితార తెలిపింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు తన తెలుగు డబ్బింగ్ పై ట్వీట్ చేయడంతో మరింత హైప్ ఇస్తోంది. 

ఇకపోతే.. ‘ది లయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడీ సినిమాకు ప్రీక్వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వస్తున్నదే ‘ముఫాసా: ది లయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’. అకాడమీ అవార్డ్ విజేత బేరీ జెంకిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీనికి దర్శకుడు.

ముఫాసా: ది లయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’  తెలుగు ట్రైలర్లో డైలాగ్స్: ''అప్పుడప్పుడూ ఈ చల్లని గాలి నా ఇంటి నుంచి వచ్చిన జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే మాయం అవుతుంది'' అంటూ ట్రైలర్‌లో వినిపించిన మహేష్ మొదటి మాట.

అలాగే 'నేనుండగా నీకు ఏం కాదు టాకా, భయపడకు'..అనే ఈ మాటలో మహేష్ హీరోయిజం ఉంది. ఆ మాట మహేష్ బాబు చెప్పడం వల్ల ట్రైలర్ మరింత ఎలివేట్ అయ్యింది. 'మనం ఒక్కటిగా పోరాడాలి' అని మహేష్ చెప్పిన మాట సైతం ఆకట్టుకుంటోంది.