NZ vs SL: న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. హ్యాట్రిక్‌తో చెలరేగిన శ్రీలంక బౌలర్

హామిల్టన్ వేదికగా బుధవారం(జనవరి 8) న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక స్పిన్నర్ మతీశ తీక్షణ హ్యాట్రిక్ తో చెలరేగాడు. కివీస్ ఇన్నింగ్స్ 35 ఓవర్లో చివరి రెండు బంతులకు సాంట్నర్, నాథన్ స్మిత్ వికెట్లు తీసుకున్న లంక స్పిన్నర్ 37 ఓవర్ తొలి బంతికి హెన్రీని ఔట్ చేశాడు. దీంతో వన్డే ఫార్మాట్ లో హ్యాట్రిక్ తీసుకున్న ఏడో శ్రీలంక ఆటగాడిగా తీక్షణ రికార్డ్ పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. అంతేకాదు 2025లో మొదటి హ్యాట్రిక్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

ఈ మ్యాచ్ లో మొత్తం నాలుగు వికెట్లు తీసుకున్న తీక్షణ 8 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో తీక్షణ తప్ప మిగిలిన బౌలర్లు విఫలం కావడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. వర్షం కారణంగా 37 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 37 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఓపెనర్ రచీన్ రవీంద్ర (79), చాప్ మన్ (62) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక 142 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తో వన్డే సిరీస్ గెలుచుకుంది.  

ALSO READ | SA20: రేపే సౌతాఫ్రికా టీ20 లీగ్.. ప్రాక్టీస్‌లో చెమటోడుస్తున్న దినేష్ కార్తీక్


  వన్డే ఫార్మాట్ లో శ్రీలంక బౌలర్లు హ్యాట్రిక్ 

- చమిందా వాస్: శ్రీలంక v జింబాబ్వే, 2001, కొలంబో
- చమిందా వాస్: శ్రీలంక v బంగ్లాదేశ్, 2003, పీటర్‌మారిట్జ్‌బర్గ్
- లసిత్ మలింగ: శ్రీలంక v దక్షిణాఫ్రికా, 2007, గయానా
- ఫర్వీజ్ మహరూఫ్: శ్రీలంక v ఇండియా, 2010, దంబుల్లా
- లసిత్ మలింగ: శ్రీలంక v కెన్యా, 2011, కొలంబో (RPS)
- లసిత్ మలింగ: శ్రీలంక v ఆస్ట్రేలియా, 2011, కొలంబో (RPS)
- తిసర పెరీరా: శ్రీలంక v పాకిస్తాన్, 2012, కొలంబో (RPS)
- వనిందు హసరంగా: శ్రీలంక v జింబాబ్వే, 2017, గాలె
- దుష్మంత మధుశంక: శ్రీ లంక v బంగ్లాదేశ్, 2018, ఢాకా
- మహేశ్ తీక్షణ: శ్రీలంక v న్యూ జీలాండ్, 2024, హామిల్టన్