కొనసాగుతున్న మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ ఎమ్మెల్సీ బై పోల్‌‌‌‌ కౌంటింగ్

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ లోకల్‌‌‌‌ బాడీ ఎమ్మెల్సీ బై పోల్‌‌‌‌ ఓట్ల లెక్కింపు  కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు బాయ్స్ కాలేజీలో కౌంటింగ్ ప్రారంభమయ్యింది.  మార్చి 28న ఎలక్షన్‌‌‌‌ జరుగగా షెడ్యూల్‌‌‌‌ ప్రకారం ఏప్రిల్‌‌‌‌ 2నే ఓట్ల లెక్కింపు నిర్వహించాల్సి ఉంది. కానీ పార్లమెంట్‌‌‌‌ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆలోచనలో కౌంటింగ్‌‌‌‌ను జూన్‌‌‌‌ 2కు వాయిదా వేశారు. దీంతో ఇవాళ  ఓట్లను లెక్కిస్తున్నారు.

ఎనిమిది టేబుళ్లపై లెక్కింపు, మధ్యాహ్నం వరకు రిజల్ట్‌‌‌‌

స్థానిక ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కోసం మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌లోని బాయ్స్‌‌‌‌ జూనియర్‌‌‌‌ కాలేజీలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఓట్ల లెక్కింపు కోసం ఎనిమిది టేబుళ్లను ఏర్పాటు చేశారు. ముందుగా ఫస్ట్‌‌‌‌ ప్రయారిటీ ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లలో ఏ క్యాండిడేట్‌‌‌‌కు కూడా గెలుపు కోసం అవసరమైన ఓట్లు రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నం వరకు రిజల్ట్స్​వచ్చే అవకాశంఉంది.

కాంగ్రెస్‌‌‌‌, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మధ్య పోటాపోటీ

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ స్థానిక ఉప ఎన్నికను కాంగ్రెస్‌‌‌‌, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముగ్గురు క్యాండిడేట్లు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఆ రెండు పార్టీల మధ్యే నడిచింది. ఎలాగైనా విజయం సాధించేందుకు క్యాండిడేట్లు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. తమకు అనుకూలంగా ఉన్న స్థానిక ఓటర్లను క్యాంప్‌‌‌‌లకు తరలించారు. గోవా, ఊటి, కొడైకెనాల్, నెల్లూరు, కర్నాటక వంటి ప్రాంతాల్లో క్యాంప్‌‌‌‌లు ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు కల్పించారు.