మహబూబ్నగర్​ లోక్సభ అభ్యర్థిగా చల్లా వంశీచంద్​ రెడ్డి నామినేషన్​

మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం స్థానానికి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా  చల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.  రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్  రవినాయక్ కు రెండు సెట్ల  నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్‌ కార్యక్రమంలో సీఎం రేవంత్​ రెడ్డి  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  అనంతరం మహబూబాబాద్​లోని ఎన్టీఆర్​ స్టేడియంలో నిర్వహించే జనజాతర సభలో సీఎం పాల్గొననున్నారు.  అంతకుముందు  చల్లా వంశీచంద్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు సీఎం. 

ఈ ప్రచారంలో సీఎం మాట్లాడుతూ..  పాలమూరు అభివృద్ధి కావలంటే 2 ఎంపీ సీట్లలో కాంగ్రెస్  గెలిపించాలని కోరారు సీఎం రేవంత్.   వంశీచంద్ రెడ్డి, మల్లు రవిని లక్ష  మెజార్టీతో గెలిపించాలన్నారు.  ఎంపీ ఎన్నికల్లో పాలమూరులో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని,  తెలంగాణలో 14 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందని  సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.   గతంలో  కేసీఆర్ పాలమూరు నుంచి గెలిచి చేసిందేమి లేదని విమర్శించారు.  పాలమూరును కేసీఆర్ నిర్లక్ష్యం చేశాడని... పాలమూరు లిప్ట్ ను కూడా  పూర్తి చేయలేదన్నారు.  గతంలో పాలమూరుకు  మంత్రి పదవులు కూడా దక్కలేదని.. డీకే అరుణ కూడా ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని విమర్శించారు.  

ALSO READ : నేను హైటెన్షన్ వైర్ లాంటోడిని.. ముట్టుకుంటే షాక్ కొడ్తది