జోగులాంబ గద్వాలకు 8 మంది ప్రొబేషనరీ ఎస్ఐలు:ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల, వెలుగు: పోలీసు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న 8 మందిని ప్రొబేషనరీ ఎస్సైలుగా నియమించామని  జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. తేజస్విని, తారక, సతీశ్ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్, తరుణ్ కుమార్ రెడ్డి, వెంకటేశ్ గౌడ్, స్వాతి, కుమార్ లకు గ్రేహౌండ్స్, పోలీస్ స్టేషన్ల డ్యూటీలు వేశామన్నారు.

9 నెలల పాటు శిక్షణ ఉంటుందని మొదటి విడతలో నలుగురికి గ్రేహౌండ్స్, నలుగురికి పోలీస్ స్టేషన్ల డ్యూటీలు వేశామన్నారు.  తర్వాత నాలుగు నెలలకు మళ్లీ వారికి డ్యూటీలో మార్పులు ఉంటాయన్నారు. ప్రొబేషనరీ పీరియడ్ లో స్టేషన్ల ఫంక్షనింగ్ డ్యూటీలపై పక్కాగా అవేర్నెస్ పెంచుకోవాలని ప్రొబేషనరి ఎస్ఐలకు ఎస్పీ సూచించారు.