ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి సన్మానం

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రజా పద్దుల కమిటీ మెంబర్ గా నియమితులైన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి శనివారం ఎస్సీ సెల్  చైర్మన్  మారుగళ్ల సాయిబాబా శాలువాతో సన్మానించారు. జిల్లాకు సంబంధించిన ఎస్సీ నిధులను కేటాయించేలా, ఎస్సీ కాలనీల్లో సౌలతులు కల్పించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేకు బాధ్యతలు అప్పగించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.