చినుకులు కురిసె.. భూతల్లి పులకించె

నిన్న మొన్నటిదాకా ఎండ వేడితో ఉక్కిరిబిక్కిరైన జనాలకు చిరుజల్లుల రాకతో కొంత ఊరట లభించింది. మంగళవారం ఉమ్మడి మహబూబ్​ నగర్​ జిల్లాలో అక్కడక్కడా మబ్బులు కమ్ముకుని చినుకులు పడ్డాయి. వనపర్తి జిల్లాలో ఉరుములు, మెరుపులతో చిరుజల్లులు పడుతుండగా ‘వీ6 వెలుగు’ తీసిన ఫొటోలివి. - శ్రీరంగాపూర్​, వెలుగు