మహారాష్ట్ర మత్రి నవాబ్ మాలిక్ కు ఈడీ షాక్ ఇచ్చింది. గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం మనీ ల్యాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందు అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్ మాలిక్ వాంగ్మూలాన్ని నమోదుచేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఆయనను విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు.అయితే మంత్రిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా ఈడీ కార్యాలయం వద్దకు భారీగా ఎన్సీపీ కార్యకర్తలు, మంత్రి అభిమానులు చేరుకున్నారు. మంత్రి పేరు చెబుతూ నినాదాలు చేశారు. దీంతో మంత్రి అక్కడున్నవారికి అభివాదం చేస్తూ... నవ్వుతూ ఈడీ అధికారుల వెంట కారు ఎక్కారు.
మరోవైపు ఇప్పటికే ఈకేసుకు సంబంధించి దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గత వారమే అరెస్ట్ చేసింది. ఇక్బాల్ ను ముంబైలోని కోర్టు 7 రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంపై ఇటీవల నమోదైన మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా జైలులో ఉన్న సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పలు దోపిడీ కేసుల్లో ఇప్పటికే థానే జైలులో ఉన్న కస్కర్‌ను తాజా కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో దావూద్ సోదరి హసీనా పార్కర్ ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే.
#WATCH | Mumbai: NCP leader and Maharashtra Minister Nawab Malik being brought out of Enforcement Directorate office, to be taken for medical examination.
— ANI (@ANI) February 23, 2022
He has been arrested by Enforcement Directorate in connection with Dawood Ibrahim money laundering case. pic.twitter.com/UMAVK5ZEVW
#WATCH | NCP workers gather outside the Enforcement Directorate office in Mumbai and raise slogans after the arrest of party leader and Maharashtra minister Nawab Malik. He has been arrested in connection with Dawood Ibrahim money laundering case. pic.twitter.com/cY6FDytpZq
— ANI (@ANI) February 23, 2022
ఇవి కూడా చదవండిః
