మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్‌కు ఈడీ కస్టడీకి అప్పగించింది కోర్టు. మార్చి 3 వరకు ఈడీ కస్టడీ విధించింది. ప్రత్యేక PMLA కోర్టు నుండి నవాబ్ మాలిక్‌తో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు బయలుదేరారు. దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే మాలిక్ తన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీ వ్యవధిలో తన మందులను తీసుకువెళ్లడానికి, ఇంటి ఆహారాన్ని తీసుకోవడానికి కోర్టు అనుమతించింది.
మరోవైపు నవాబ్ మాలిక్ అరెస్ట్ పై ఎన్సీపీ నేతలు సమావేశం అయ్యారు. నవాబ్ మాలిక్‌ను తప్పుడు పద్ధతిలో అరెస్టు చేశారని ఆరోపించారు. ప్రతిపక్షాలపై దాడి చేసినందుకు శిక్ష అనుభవిస్తున్నాడన్నారు. న్యాయం కోసం పోరాడతామని ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్ బుల్ తెలిపారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కేంద్రం మా మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. బెంగాల్ సీఎం మమత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు కాల్ చేశారు. నవాబ్ మాలిక్ అరెస్ట్ పై ఆయనతో మాట్లాడారు. ఎన్సీపీకి మమత తన మద్దతు తెలిపారు.
గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం మనీ ల్యాండరింగ్ కేసు విచారణకు సంబంధించి బుదవారం ఉదయం 6 గంటలకు నవాబ్ మాలిక్ ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు.. ఓ గంట సేపు ప్రశ్నించిన అనంతరం 7:30 నిమిషాలకు ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి ప్రశ్నించారు. అయితే ఆ సమయంలో నవాబ్ మాలిక్ ఈడీకి సహకరించలేదని సమాచారం. ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేశారు.
West Bengal CM Mamata Banerjee speaks to NCP Chief Sharad Pawar, expresses support after the arrest of NCP leader and Maharashtra Minister Nawab Malik pic.twitter.com/Da7FDslNAa
— ANI (@ANI) February 23, 2022
Mumbai | Special PMLA court sends Maharashtra minister and NCP leader Nawab Malik to Enforcement Directorate custody till 3rd March, in connection with Dawood Ibrahim money laundering case pic.twitter.com/jsKwV5ErdI
— ANI (@ANI) February 23, 2022
ఇవి కూడా చదవండిః
ఉక్రెయిన్లో ఎమర్జెన్సీ
తమిళనాడు ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ గెలుపు
