కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహరాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ప్రతీ రోజు రాత్రి 11గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కర్ఫ్యూ నేటి నుంచి జనవరి 5వరకు కొనసాగుతున్నట్లు తెలిపింది. యూకేలో కొత్తకరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన మహరాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా యూకే లో కొత్త కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో అప్రమత్తమైన కేంద్రం భారత్ నుంచి యూకేకి వెళ్లే విమానాల్ని రద్దు చేసింది. ఇక కర్ఫ్యూ నేపథ్యంలో యురేపియన్ యూకే కాకుండా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ప్రయాణికులు 14రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆదేశాలు జారీ చేశారు.
