మెడనొప్పితో ఆస్పత్రిలో చేరిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే

మెడనొప్పితో ఆస్పత్రిలో చేరిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే

కొద్దిరోజులుగా తీవ్ర మెడనొప్పితో బాధపడుతున్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సర్వైకిల్ చికిత్స కోసం ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. రెండు నుంచి మూడు రోజులు ఆస్పత్రిలోనే చికిత్స పొందాలని డాక్టర్లు సూచించినట్టు సీఎం ఉద్ధవ్ తెలిపారు. ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నాయని, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ముంబైలో ఏ ఆస్పత్రిలో చేరుతున్నారనే విషయాన్ని మాత్రం సీఎం ఉద్ధవ్ చెప్పలేదు. త్వరలో సర్వైకల్ పెయిన్‌కు సంబంధించి సర్జరీ చేయించుకునే అవకాశం ఉందని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. 

గత రెండేళ్లుగా రాష్ట్రంలో కరోనా కారణంగా అవిరామంగా పోరాటం కొనసాగిస్తూ తన మెడ నొప్పిని కూడా పట్టించుకోలేదని సీఎం ఉద్ధవ్ అన్నారు. మెడనొప్పి క్రమంగా తీవ్రమై ఇప్పుడు భరించలేనంతగా మారింది. మెడనొప్పి నుంచి రిలీఫ్ అయ్యేందుకు ఆయన అప్పుడప్పుడు మెడపట్టీ ధరించారు కూడా. క్షణం కూడా తీరిక లేకుండా గడిపేశారు. ఉన్నట్టుండి మెడనొప్పి మరింత తీవ్రంగా మారడంతో సరైన చికిత్స కోసం ముంబై ఆస్పత్రిలో చేరారు.