- ఆకట్టుకున్న పోతురాజుల నృత్యాలు
జోగిపేట, వెలుగు: ఆషాఢ మాసం పురస్కరించుకొని జోగిపేటలోని పడమటి గౌని (కిందిగల్లి)లో మంగళవారం సాయంత్రం బోనాలు ఘనంగా నిర్వహించారు. ఆ వార్డు కౌన్సిలర్ నాగరాజ్ (నాని) ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మహంకాళీ మాత ప్రతిమ ఊరేగింపును నిర్వహించారు. శ్రీ రాజ రాజేశ్వరీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి డప్పుదరువు చప్పుళ్లతో, పోతురాజుల నృత్యాలతో డీజే పాటలతో ఊరేగింపు ముందుకు సాగింది.
ఈ ఊరేగింపు కార్యక్రమంలో వార్డు మహిళలు, యువకులు, నాయకులు, దశరథ్ డాకూరి అశోక్, వెంకటేశం, ఆంజనేయులు, నర్సింలు, ప్రభు, శ్రీధర్, వినయ్ గౌడ్, మల్లేశం, రమేశ్, సత్యం, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.