ఏసీబీకి చిక్కిన మహాదేవ్పల్లి పంచాయతీ సెక్రటరీ

సంగారెడ్డి జిల్లాలో ఓ అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. సంగారెడ్డి జిల్లా మహాదేవ్ పల్లి పంచాయతీ సెక్రటరీ ఉమేష్  రూ.15 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డాడు. 

మాసన్ పల్లికి చెందిన బాధితుడు ఫిష్ స్టాల్ పెట్టుకునేందుకు బ్యాంక్ లోన్ కోసం వెళ్లగా నో డ్యూస్ సర్టిఫికెట్ అడిగారు. దీంతో పంచాతీయ సెక్రటరీ ఉమేష్ ను సంప్రదించగా.. నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే రూ. 15 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

ALSO READ : కేటీఆర్‌.. తెలంగాణ కోసం మీరు చేసిన త్యాగమేంటో చెప్పు: టీపీసీసీ చీఫ్

దీంతో శుక్రవారం కల్మేర్ మండల ఎంపిడీవో ఆఫీసులో బాధితుడి నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.