మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ లోకల్‌‌‌‌ బాడీ ఎమ్మెల్సీ స్థానానికి ముగిసిన నామినేషన్లు

  •    నేడు స్క్రూటినీ, 14న విత్‌‌‌‌ డ్రాకు చాన్స్‌‌‌‌
  •     28న పోలింగ్‌‌‌‌, ఏప్రిల్‌‌‌‌ 2న కౌంటింగ్‌‌‌‌
  •     కీలకంకానున్న ఎంపీటీసీల ఓట్లు

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు : మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ లోకల్‌‌‌‌ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 16 మంది 28 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం చివరి రోజు కావడంతో చాలా నామినేషన్లు వచ్చాయి. మంగళవారం స్క్రూట్నీ నిర్వహించి, 14 వరకు విత్‌‌‌‌డ్రాకు అవకాశం కల్పించారు. మార్చి 28న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌‌‌‌ జరగనుంది. ఏప్రిల్​ 2న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. 

ప్రధాన పార్టీల క్యాండిడేట్లు ఇద్దరే...

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ లోకల్‌‌‌‌ బాడీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం 16 మంది క్యాండిడేట్లు 28 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌‌‌‌, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి ఒక్కో క్యాండిడేట్‌‌‌‌ నామినేషన్‌‌‌‌ వేయగా, మిగిలిన వారంతా ఇండిపెండెంట్‌‌‌‌గానే నామినేషన్లు వేశారు. వీరిలో ఎంపీటీపీలు కూడా ఉన్నారు. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 4 ప్రారంభం కాగా ఐదో తేదీన బిజినేపల్లి ఎంపీటీసీ మంగి విజయ్‌‌‌‌ ఒక సెట్‌‌‌‌ నామినేషన్‌‌‌‌ వేశారు. మళ్లీ ఆయనే 8న ఒక సెట్‌‌‌‌, సోమవారం మరో సెట్‌ నామినేషన్లు వేశారు. శుక్రవారం మహాశివరాత్రి, శనివారం హాలీడే, ఆదివారం అమావాస్య కావడంతో ఎవరూ నామినేషన్లు వేయలేదు. సోమవారం చివరి రోజు కావడంతో కాంగ్రెస్‌‌‌‌, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ క్యాండిడేట్లతో పాటు ఇతర అభ్యర్థులందరూ ఒకేసారి నామినేషన్‌‌‌‌ సెంటర్‌‌‌‌కు వచ్చారు. కాంగ్రెస్‌‌‌‌ తరఫున టీటీడీ బోర్డు మాజీ మెంబర్​మన్నె జీవన్‌‌‌‌రెడ్డి మూడు సెట్ల నామినేషన్లు వేశారు ఆయన వెంట ఎక్సైజ్‌‌‌‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్లానింగ్‌‌‌‌ కమిషన్‌‌‌‌ వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ జిల్లెల చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, వాకిటి శ్రీహరి, వీర్లపల్లి శంకర్, కూచుకుళ్ల రాజేశ్‌‌‌‌రెడ్డి, జి.మధుసూదన్‌‌‌‌రెడ్డి, మేఘారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్‌‌‌‌ స్టేట్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ ఒబేదుల్లా కొత్వాల్ ఉన్నారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్‌‌‌‌ నవీన్‌‌‌‌రెడ్డి రెండు సెట్ల నామినేషన్లు వేశారు. ఈయన వెంట ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌‌‌‌రెడ్డి, విజేయుడు ఉన్నారు. అలాగే బిజినేపల్లి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎంపీపీ శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌ సతీమణి పి.సుమలత ఒక సెట్‌‌‌‌, కొల్లాపూర్‌‌‌‌ మండలం అంకిరావుపల్లి ఎంపీటీసీ శంకర్‌‌‌‌ నాయక్‌‌‌‌ ఒక సెట్‌‌‌‌, సంగారెడ్డి జిల్లా పటాన్‌‌‌‌చెరు మండలం ముత్తంగి ఎంపీటీసీ గాదిల కుమార్‌‌‌‌గౌడ్‌‌‌‌ ఒక సెట్‌‌‌‌, గట్టు- 2 ఎంపీటీసీ ఎస్‌‌‌‌. కృష్ణ రెండు సెట్ల నామినేషన్లు వేశారు. మున్నూరు రవి, గవినోళ్ల బలరాంరెడ్డి, మహ్మద్​ రహీం ఖాన్‌‌‌‌, శ్రీకాంత్‌‌‌‌ పిల్లెల, ఆర్. జీవన్‌‌‌‌రెడ్డి, సుదర్శన్‌‌‌‌రెడ్డి ఒక్కో సెట్‌‌‌‌ నామినేషన్‌‌‌‌ దాఖలు చేశారు. లక్ష్మీరెడ్డి, సుదర్శన్‌‌‌‌ గౌడ్‌‌‌‌, దేవీ రవీందర్‌‌‌‌ రెండ్లు సెట్ల నామినేషన్లు వేశారు.

ఎంపీటీసీల ఓట్లే ఎక్కువ

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 1,439 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో అత్యధిక ఓట్లు ఎంపీటీసీలవే ఉన్నాయి. వీరు ఎవరికి సపోర్ట్‌‌‌‌ చేస్తే వారికే విజయం దక్కే అవకాశం ఉంది. మొత్తం ఓట్లలో ఇద్దరు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, 888 మంది ఎంపీటీసీలు, 83 మంది జడ్పీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు ఉన్నారు.