మెడికల్ కాలేజీ దగ్గర ఎగిసిపడుతున్న మంటలు.. భయాందోళనలకు గురైన విద్యార్థులు

మహబూబాబాద్ మెడికల్ కాలేజీ పక్కన మంటలు ఎగిసిపడుతున్నాయి. కాలేజీ పక్కన ఖాళీగా ఉన్న ప్రదేశంలో చెట్లు, చెదారం పూర్తిగా కాలిపోయింది. ఈ క్రమంలో మెడికల్ కాలేజీ పరిసర ప్రాంతాలు పూర్తిగా పొగతో ముసుకుపోయాయి. ఆలర్ట్ అయిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ వెంకట్ లాకవత్, సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనతో కాలేజీ విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. 

అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాలేజీ పక్కన ఖాళీగా ఉన్న ప్రదేశంలో చెట్లు, చెదారానికి గుర్తు తెలియని వ్యక్తులు మంటపెట్టారని కాలేజీ యాజమాన్యం తెలిపింది. ఈ ప్రమాదంలో కరెంటు తీగలు, మోటారు కూలిపోయాయి.