చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై శిలాద్రవం

చంద్రుడిపై అన్వేషణలో భాగంగా ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్​–3, అందులోని విక్రమ్​ ల్యాండర్​ లో ఉన్న ప్రజ్ఞాన్​ రోవర్​ 100 మీటర్ల మేరకు ప్రయాణించి కీలక సమాచారాన్ని సేకరించింది.

ఈ సమాచారాన్ని అహ్మదాబాద్​లోని ఫిజికల్​ రీసెర్చ్​ లేబొరేటరీ పరిశోధకులు విశ్లేషించగా 4.5 బిలియన్​ సంవత్సరాల క్రితం చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై భారీ శిలాద్రవం ఉండేదన్న వాదనకు బలాన్ని చేకూర్చే విషయాన్ని వెల్లడించిందని పేర్కొన్నారు.