సీబీఐపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది మద్రాస్ హైకోర్ట్ మదురై బెంచ్. పంజరంలో చిలుక లాగా సీబీఐ పరిస్థితి ఉందన్నారు జస్టిస్ N కిరుబకరన్, జస్టిస్ పుగలేందీ. పంజరంలోని CBIకి స్వేచ్ఛ కావాలన్నారు. ఎలక్షన్ కమిషన్ మాదిరిగా CBI కూడా పూర్తిగా స్వతంత్ర్య సంస్థగా ఉండాలన్నారు. CBI డైరెక్టర్ కు కేబినెట్ సెక్రటరీకి ఉన్నట్టు ఎక్స్ క్లూజివ్ పవర్స్ ఉండాలని... అతను హోంశాఖ మంత్రికి, ప్రధానమంత్రికి మాత్రమే రిపోర్ట్ చేసే అధికారం ఉండాలన్నారు. గతంలో సుప్రీంకోర్టు కూడా CBIని పంజరంలో చిలుక అంటూ వ్యాఖ్యానించింది. సీబీఐని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయని... అధికారంలో ఉన్నవారికి ఊడిగం చేసేలా సంస్థ మారిపోయిందని విమర్శలు ఉన్నాయి.
