చెన్నై: తమిళ భాష కూడా దేవ భాషేనని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పంది. తమిళంలోనే ఆళ్వార్లు, నాయన్మార్లు, అరుణగిరినాథర్ చేసిన కీర్తనలతో రాష్ట్రంలోని ఆలయాలు కుంభాభిషేకాలు నిర్వహించుకోవచ్చని మద్రాస్ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కరూరు జిల్లా పరిధిలోని అరుళ్‌మిగు పశుపతేశ్వర స్వామి ఆలయ కుంభాభిషేకం కార్యక్రమాన్ని తమిళ తిరుమురైగళ్, తమిళ శైవ మంత్రాలతో, అమరావతి ఆట్రంగరై కరూరార్ కీర్తనలతో నిర్వహించేలా తమిళనాడు రాష్ట్ర దేవాదాయ శాఖకు, ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు విచారణ జరిపింది. మన దేశంలో సంస్కృతమే దేవభాషగా పరిగణింపబడుతోందని, అయితే వివిధ దేశాల ఆలయాల్లో వివిధ మతాచారాలు పాటిస్తున్నారని, ఆయా ప్రాంతాలకు చెందిన భాషలతో దైవాలను ఆరాధిస్తున్నారని మద్రాస్ హైకోర్టు ధర్మాసనం వివరించింది.
