ఖైరతాబాద్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధనం గంగాధర్‌కు టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని మాదిగ, మాదిగ ఉపకులాల ఐక్యవేదిక కోరింది. డీఎస్పీ ఉద్యోగాన్ని సైతం వదిలి ప్రజా సేవ కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయనకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని విజ్ఞప్తి చేసింది.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం వారు మాట్లాడారు. బుడగ జంగానికి చెందిన గంగాధర్ విజయానికి తాము కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ నుంచి ఆయనకు టికెట్ ఇస్తే విజయం సాధిస్తారని చెప్పారు. సమావేశంలో ఎస్సీ 57 ఉపకులాల వ్యవస్థాపక అధ్యక్షుడు చింతల రామలింగం, తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు, తెలంగాణ మాదిక హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు జన్ను కనక రాజు, టీఎమ్ఆర్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజ్ మాదిగ, తులసీరాం తదితరులు పాల్గొన్నారు.