విహారయాత్రలో విషాదం.. చెరువులో మునిగి.. అనంతలోకాలకు

విహారయాత్రలో  విషాదం..  చెరువులో మునిగి.. అనంతలోకాలకు

మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో ఓ విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో స్నానం చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు మునిగి మరణించారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన మంగళవారం ఆగస్టు 15న సాయంత్రం జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉదయ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిక్నిక్ స్పాట్ అయిన భైరవ్ కుండ్ వద్ద జరిగిందని చెప్పారు.

ఇండోర్‌కు చెందిన 14 మంది యువకులు భైరవ్ కుండ్ వద్ద విహారయాత్రకు వెళ్లారని ఉదయ్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అజయ్ గుర్జార్ తెలిపారు. స్నానం చేస్తుండగా వారిలో ఒకరు నీటిలో మునిగిపోగా, మరో ఇద్దరు రక్షించేందుకు ప్రయత్నించారన్నారు. అలా ఆ ముగ్గురు వ్యక్తులు నీటిలో మునిగిపోయారని, మృతులు 28 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని తెలిపారు. మంగళవారం రాత్రి చీకటి పడడంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించలేకపోయామని అధికారులు వివరించారు.

స్టేట్ డిజాస్టర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫోర్స్ బృందం మరుసటి రోజు ఉదయం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది, ఆ తర్వాత ముగ్గురి మృతదేహాలను వెలికితీసిందని అధికారులు తెలిపారు.