చట్టం తేనున్న మధ్యప్రదేశ్
భోపాల్ :ఇది వరకే బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా లవ్ జిహాద్ చట్టాన్ని తెచ్చిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్టోన్ పెల్టర్స్ ను కంట్రోల్ చేసేందుకూ చట్టం తేనుంది. రాళ్లు విసిరేవారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఎంపీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. స్టోన్ పెల్టర్ లు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను నాశనం చేస్తున్నారని, ఇలాంటి వారికి వ్యతిరేకంగా చట్టం తెస్తామని చెప్పారు.ఆస్తులకు నష్టం జరిగితే దోషుల నుంచే పరిహారం వసూలు చేస్తారని తెలిపారు. వారి ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు. ఉజ్జయిన్ , ఇండోర్, మంద్సర్ లో ఇటీవల వీహెచ్ పీ చేసిన ర్యాలీలపై కొందరు రాళ్లు విసరడంతో ఎంపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
